Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

సేంద్రీయ వ్యవసాయం

సేంద్రీయ వ్యవసాయం ఉపోద్ఘాతం:

  • సేంద్రియ వ్యవసాయమనేది ఒక ఉత్పాదక పద్ధతి. ఈ పద్ధతిలో కృత్రిమ రసాయనాల ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా నిషేధం.
  • కేవలం రసాయనాల నిషేధం చేతనే సంపూర్ణ సేంద్రియ వ్యవసాయం కాదు. ఇందులో భూమి ఆరోగ్యం కాపాడుతూ, భూసారం పెంచుతూ ప్రకృతి సమతుల్యం కాపాడుతూ, వాతావరణం కలుషితం కాకుండా జీవన వైవిధ్యం కాపాడుతూ పశుపక్ష్యాదుల మరియు మానవాళి ఆరోగ్యం రక్షిస్తూ స్ధానిక వనరులతో చేసేదే సేంద్రియ వ్యవసాయం.
  • సేంద్రియ వ్యవసాయ పద్ధతులు-విధానాలు
  • నేల ఆరోగ్య పరిరక్షణ, శత్రు పురుగుల యాజమాన్యం, తెగుళ్ళ యాజమాన్యం, పంట పెరుగుదల-అధిక దిగుబడి, జీవ నియంత్రణ పద్ధతులు.
  • సంపూర్ణ సేంద్రియ పద్ధతులు-లాభాలు:
  • విదేశీ పెట్టుబడులకు తావులేదు. పెట్టుబడులు తక్కువ (అన్ని గ్రామీణ వనరులే కాబట్టి).
  • నేల బాగుపడుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది.
  • భూమిలో సూక్ష్మజీవసంపద మరియు దేశి వానపాములు అభివృద్ధి చెంది, భూమి సారవంతమవుతుంది.
  • పంట ఉత్పాదక పెరుగుతుంది. పశుపక్ష్యాదులు మరియు మానవాళి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.
  • విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. రైతు మిత్ర పురుగులు అభివృద్ధిచెంది శత్రు పురుగుల సహజ నియంత్రణ జరుగుతుంది.
  • నేలలో తేమ నిల్వశక్తి పెరుగుతుంది. వ్యవసాయంలో సుస్ధిరత ఏర్పడుతుంది.
  • సేంద్రియ ఉత్పత్తులు రుచిగా ఉంటాయి. రైతులకు అధిక లాభాలు చేకూరి ఆర్ధిక అభివృద్ధి జరుగుతుంది.
  • పంటనుబట్టి ఎకరాకు రూ.పది వేల నుండి రూ.20 వేల వరకు తగ్గుతుంది.
Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.