Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

రైతు సేవలు

Agmarks Farmer Services

భారత దేశంలో డిజిటల్ సేవలు:

అగ్మార్క్స్ భారతదేశంలో మొట్ట మొదటి సారిగా డిజిటల్ వ్యవసాయ సేవలను అందిస్తుంది. అగ్మార్క్స్ రైతులకు రైతు సేవా కేంద్రం ద్వారా మరియు ఆన్లైన్ వ్యవసాయ మార్కెట్ల ద్వారా డిజిటల్ సేవలను అందిస్తుంది. ఆగ్మార్స్ డిజిటల్ సేవలు సమర్థవంతంగా స్థానాన్ని గుర్తించి మీ వ్యవసాయ కార్యకలాపాలను మీ దగ్గర లోనె ఉన్న వారితో అనుసందానం చేసి లాభదాయకంగా మార్చగలవు.



వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్ మరియు సరఫరా సమతుల్యం:

వ్యవసాయదారులు వివిధ రకాల కొలమానాలను ఉపయోగించడం ద్వారా వారి పంటకు ఉన్న డిమాండ్ మరియు సరఫరా విలువలను తనిఖీ చేసుకోవడనికి అగ్మార్క్స్ అనుమతిస్తుంది. అంతేకాకుండా, పంట నిర్వహణ ద్వారా రైతులకు ఉపయోగించదగిన ఉత్పత్తులను మరియు దాచుకోవడానికి గోదాములను విక్రయించటానికి ముందే సూచిస్తుంది. ఇది చివరికి ధర స్థిరీకరణ, డిమాండ్ మరియు సరఫరా సమతుల్యతకు దారితీస్తుంది. అగ్మార్క్స్ పంట సమయంలో అధిక ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గిస్తుంది మరియు దిగుబడి పెంచుతుంది.

వ్యవసాయ ఉత్పత్తుల ఇ-యార్డ్ / ఇ-వేలం:

అగ్మార్క్స్, వ్యవసాయ మార్కెట్ ఇ-యార్డ్ కార్యాచరణ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఇ-వేలం కోసం వేదికను ఏర్పాటు చేసింది. ఈ వ్యవసాయ మార్కెట్ ద్వారా కొనుగోలుదారుడు మరియు అమ్మకం దారులు వారి ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, వాటి విలువలను సరిచూసుకోవచ్చు. ఈ ఇ-యార్డు రైతులకు స్థానిక మరియు అంతర్జాతీయ మార్కెట్ లాగా పనిచేస్తుంది. ఈ మార్కెట్ ఉత్పత్తుల వ్యర్థాలను మరియు రవాణా వ్యయాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కొనుగోలుదారుడు మరియు అమ్మకం దారుల మధ్య దూరాన్ని లెక్కించి మీ దగ్గరలో ఉన్న కొనుగోలుదారులను సూచిస్తుంది.

సహజ వ్యవసాయం మరియు ఒప్పంద వ్యవసాయం:

అగ్మార్క్స్ రైతులకు డిజిటల్ సేవలలో భాగంగా సహజ వ్యవసాయం మరియు ఒప్పంద వ్యవసాయ పద్దతులను అందిస్తుంది. రైతులు వాతావరణం, మార్కెట్ ధరలు, ఖర్చు మరియు సాగు విధానం, వ్యాధి నిర్వహణ, నేల మరియు విత్తనాల పరీక్షా ప్రయోగశాలల గురించి, సమీపంలోని ప్రాసెసర్లు, వర్తకులు, నిల్వ గోదాములు గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విత్తనాలు, ఎరువులు, బయో, సేంద్రీయ, పురుగుమందులు మొదలైన వాటిని కొనడానికి మరియు ఉత్పత్తిని గరిష్ట ధరకు విక్రయించడం కొరకు ఉపయోగపడుతుంది. నివారణ మరియు నియంత్రన చర్యలు తీసుకోవటానికి సకాలంలో సలహాలను పొందడానికి, మొక్క యొక్క ఫోటోను అప్లోడ్ చేయడానికి, అగ్మార్క్స్ ఒక వ్యాధి నిర్వహణ విభాగాన్ని అందిస్తుంది.

విభాగాలు

  • పంటలు
  • కూరగాయలు
  • పాల ఉత్పత్తులు
  • పశుసంరక్షణ

ముఖ్య ఉపయోగాలు

  • డిమాండ్, సరఫరాల సమతూకం మరియు ధరల అంచనా సమాచారంతో పంట నిర్ణయం.
  • విత్తనాలు / మొక్కలు, సేంద్రీయ ఎరువులు, బయో మందులు, పురుగుమందుల వివరాలు తెలుసుకోవచ్చు.
  • నీటిపారుదల వివరాలు, వాతావరణ మరియు వర్షపాతం యొక్క సూచనలు తెలుసుకోవచ్చు.
  • వ్యాధి, కీటకం మరియు కలుపు నియంత్రణ పద్ధతులు తెలుసుకోవచ్చు.
  • కోల్డ్ స్టోరేజెస్ మరియు గిడ్డంగుల మద్దతు - అందుబాటులో ఉన్న కోల్డ్ స్టోరేజెస్ మరియు గిడ్డంగుల సమాచారంతో పాటుగా ధరల వివరాలు తెలుపబడును.
  • సాగు ఖర్చు & విధానము.
  • అన్ని రకాల సాగు ఖర్చులను ఇంచుమించుగా తెలుపుతుంది.
  • ప్రాసెసర్లకు, వర్తకులు, విక్రేతలు మొదలైన వారికి రైతుల ఉత్పత్తులను చూపుతుంది.
  • సమీపంలోని ప్రాసెసర్లు, వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్లు, సరఫరాదారులు, విక్రేతలు మరియు రవాణా సాధనాల వివరాలను శోదించవచ్చు.
  • సకాలంలో రవాణా మరియు ఇతర సేవల ద్వారా కూరగాయల అమ్మకం.
  • సకాలంలో సేవలు.
  • పాల - పాలు సేకరణ మద్దతు.
  • సకాలంలో టీకాల సమాచారంతో మరియు మార్కెట్ సమాచారంతో జంతువుల విభాగం మద్దతు ఇస్తుంది.
Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.