Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
  • phone
    +91 - 9851 222 888
    +91 - 9851 222 999
  • Whatsapp
    +91 - 9851 222 999
  • info
    info@agmarks.com
  • Location
    Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

తెగుళ్ళు/చీడ పురుగులు

area wise diseases

పంట పేరు:

ప్రత్తి

తెగులు/ చీడ పురుగు పేరు:

తెల్ల దోమ

నివేదించిన ప్రదేశం:

దండమూడి

నివేదించిన మండలం:

పొన్నూరు

లక్షణాలు:

తెల్ల దోమ ఎక్కువగా నవంబర్ నుంచి జనవరి-ఫిబ్రవరి మాసాల వరకు ప్రత్తిని ఆశిస్తూ ఉంటుంది. గ్రుడ్ల నుండి వెలువడిన పిల్లలు ఈనెల దగ్గరగా స్థిరపడి రసాన్ని పీలుస్తాయి.
పిల్ల పురుగులు ఆకుల అడుగున నిశ్చలంగా నిలిచిపోయి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకి మారి, ఎండిపోయి, మొక్కలు గిడసబారి పోతాయి.
ఈ పురుగులు విసర్జించే తేనెవంటి పదార్ధం వలన నల్లని బూజుతెగులు వ్యాప్తిస్తుంది.
ఈ దోమ ఆశించిన పైరులో ఆకులు, మొగ్గలు, పిందెలు రాలిపోవటమే కాకుండా కాయలు పూర్తిగా ఎదగకముందే పగిలిపోతాయి మరియు గింజ నాణ్యత క్షీణిస్తుంది. గింజలలో నూనె శాతం కూడా తగ్గిపోతుంది.

కారణ జీవి:

తెల్ల దోమ

నివారణ చర్యలు:

పసుపు రంగు అట్ట ముక్కలను పొలంలో అక్కడక్కడ పెట్టుకోవాలి.
ఆకుకు 5-10 తెల్ల దోమలు గమనించిన ట్రైజోఫాస్ 2.5 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. వేప సంభందిత మందులు ఈ పురుగును అదుపు చేస్తాయి
కాయతొలిచే పురుగులను నివారించడానికి వాడే సింథటిక్ పైరిత్రాయిడ్స్ వలన ఈ పురుగు ఉధృతి చాలా ఎక్కువవుతుంది. తెల్ల దోమ అదుపుకు విధిగా అధిక మోతాదు నీటిని నాప్ సాక్ స్ప్రేయార్ ద్వారా పిచికారి చేయాలి.

నియంత్రణ చర్యలు:

విత్తే ముందు విత్తన శుద్ధి చేయాలి.

ఉపయోగించతగినవి:

ఉపయోగించకూడనివి:

పైరిత్రాయిడ్ మందులు వాడరాదు. నత్రజని ఎరువులు తగ్గించాలి.

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.