-
+91 - 9851 222 888
+91 - 9851 222 999 -
+91 - 9851 222 999
-
info@agmarks.com
-
Andhra Pradesh Mangalagiri, Guntur
మిరప
ఆకు పై ముడత తెగులు
పండ్రపాడు
కాకుమాను
తెగులు ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలోకి మారుతాయి.
ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చ లేదా పసుపు పచ్చరంగు కలిగి ఉండి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది.
ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి ముడుచుకుంటాయి. పెరుగుదల లోపించి మొక్కలు గిడసబారతాయి. పూత, కాత ఉండదు.
ఈ తెగులు వైరస్ వలన వస్తుంది. తెల్లదోమ వైరస్ ను వ్యాప్తి చేస్తుంది
కార్బరిల్ 3 గ్రా లేదా ఫాసలోన్ 3 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.25 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి ఆకు అడుగు భాగం బాగా తడిచేల పిచికారి చేయాలి. నాటిన 15 మరియు 45 వ రోజు ఫిప్రొనిల్ 0.3% గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయటం ద్వారా పై ముడతను నివారించుకోవచ్చు.
ముందు జాగ్రత్త చర్యగా ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి.
ఎకరానికి 4-5 కిలోల కార్బోఫ్యురాన్ 3G గుళికలను పొలంలో వేసుకోవాలి.
పొలం చుట్టూ 2-3 వరుసలు జొన్న గాని మొక్కజొన్న గాని రక్షక పంటగా వేసుకోవాలి.
పంటలో ఎగువ మరియు దిగువ ఆకు ముడత రెండూ ఉంటే పెగాసస్ లేదా క్లోర్ఫిన్ ఫయర్ లను వాడుకోవచ్చు
కార్బారిల్ మరియు ఎసిఫేట్ మరియు స్పైనోసాడ్ లను ఎగువ మరియు దిగువ ఆకు ముడత రెండూ ఉన్నప్పుడు వాడరాదు.