Agmarks
Telugu Language
×
×
×

+91-9851222999

Contact Us ×
 • phone
  +91 - 9851 222 888
  +91 - 9851 222 999
 • Whatsapp
  +91 - 9851 222 999
 • info
  info@agmarks.com
 • Location
  Andhra Pradesh Mangalagiri, Guntur

Feedback

user
phone
email

అగ్రి వార్తలు

agmarks
ఎపి ప్రభుత్వం కొత్త రైతు సహాయ పథకాన్ని ప్రకటించింది.
రైతులకు వార్షిక పెట్టుబడి మద్దతు రూ. 12,500.

వైఎస్సార్ రైతు భరోసా పధకంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్ల పాటు రూ. 12,500 చొప్పున అందిస్తామన్న పెట్టుబడి సాయాన్ని ఈ ఏడాది అక్టోబర్ 15, 2019 నుంచే పెద్ద ఎత్తున అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు.

None

06/07/2019

agmarks
రైతు సంక్షేమం కోసం శాశ్వతంగా 9 గంటల పగటి ఉచిత విద్యుత్.
చౌకగా నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పునరుద్ఘాటించారు. తొమ్మిది గంటల పగటి విద్యుత్ సరఫరాను శాశ్వతం చేస్తామన్నారు. దీనివల్ల సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిస్తుందనేది ముఖ్యమంత్రి ప్రగాఢ విశ్వాసమని తెలిపారు.
07/07/2019

agmarks
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
జనవరి 13 2016 న కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్తగా ప్రవేశపెట్టిన పంట బీమా పథకం రైతలు జీవితాల్లో భారీ మార్పు తీసుకువస్తుందని ప్రధాని నరేంద్రమోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ పథకం కింద ఖరీఫ్ ఆహార ధాన్యాలు లేదా నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు కేవలం 2 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే.. రబీ ఆహారధాన్యాలు లేదా నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు కేవలం 1.5 శాతం చెల్లిస్తే చాలు. ప్రీమియంలో మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి.

ఒక పంటల బీమా పథకంలో కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా ఇన్సూరెన్స్ చెల్లించే పథకం ఇదే.

ఈ పథకం భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు చేయబడుతుంది.

13/01/2019

agmarks
వ్యవసాయ రంగాన్ని మార్చడానికి డిజిటల్ మార్గం
భారతీయ వ్యవసాయం, పోస్ట్ గ్రీన్ రివల్యూషన్, మార్కెట్ సంస్కరణలపై దృష్టి పెట్టాలి, దీని కోసం డిజిటల్ టెక్నాలజీలు కీలకం.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 2016 లో ప్రకటించారు. ఈ విధానం పెరుగుతున్న ఆహార ఉత్పత్తిని ప్రధాన కేంద్రంగా మార్చింది. వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేయాలనే లక్ష్యం చాలా మంది నిపుణులు ప్రాధాన్యతలలో మార్పును ప్రశంసించినప్పటికీ సాధించలేనిదిగా విమర్శించారు.

None

01/03/2019

agmarks
పరంపరాగత్ కృషి వికాస్ యోజన
పరంపరాగత్ కృషి వికాస్ యోజన ఏప్రిల్, 2015 లో ప్రారంభించబడింది. నిర్వహణీయ జాతీయ వ్యవసాయ మిషన్ ప్రధాన ప్రాజెక్ట్ (NMSA)లోని సాయిల్ హెల్త్ మానేజ్మెంట్ (SHM)కు సంబంధించిన ఒక విస్తృత భాగం. PKVY కింది సమూహ విధానం మరియు PGS సర్టిఫికేషన్ ద్వారా సేంద్రీయ గ్రామలను దత్తత తీసుకొని సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రచారం చేస్తారు. PKVY కింది సమూహ విధానం మరియు PGS సర్టిఫికేషన్ ద్వారా సేంద్రీయ గ్రామలను దత్తత తీసుకొని సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రచారం చేస్తారు.
01/04/2019

agmarks
నేల ఆరోగ్య కార్డు
నేల ఆరోగ్య కార్డును 2015 ఫిబ్రవరి 15న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశం లోని అన్ని భూ కమతాలకు ప్రతి రెండేళ్ళకొకసారి నేల ఆరోగ్య కార్డును ఇస్తారు. దీని సాయంతో రైతులు పంట దిగుబడి కోసం అవసరమైన మోతాదులో పోషకాలను వాడగలగటమే కాకుండా నేల ఆరోగ్యాన్నీ, సారాన్ని మెరుగు పరచకోగలుగుతారు.
15/02/2015

agmarks
ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన
ఈ పథకాన్ని జులై 1 2015 లో ప్రారంభించబడింది. 'Per Drop More Crop' నివాదంతో ప్రతి నీటి బిందువును సద్వినియోగపరిచే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. ప్రతి రైతు భూమికి నీటి సదుపాయం కల్పించడం దీని పధాన ఉద్దేశం. 2020 నాటికి రూ. 50 కోట్లతో ఈ పధకాన్ని అమలు చేయాలని సంకల్పించారు. సాగునీటి పారుదల రంగంలోకి తగిన పెట్టుబడులను ఆకర్షించడం, వ్యవసాయ యోగ్యమైన సాగుభూమికి విస్తరించడం, వాటికి తగిన వనరులను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
01/07/2015

agmarks
2020 నాటికి భారత్ యూరియా వినియోగాన్ని సగానికి తగ్గించాలని ప్రధాని మోదీ కోరుతున్నారు.
2022 నాటికి యూరియా వినియోగాన్ని సగానికి తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు ఒక స్పష్టమైన పిలుపునిచ్చారు. గోధుమ ఉత్పాదకతను 3 రెట్లు పెంచిన హిమాచల్ ప్రదేశ్ రైతుల ఉదాహరణను ఆయన ఉదహరించారు, సాయిల్ హెల్త్ కార్డులు (ఎస్‌హెచ్‌సి) ఆధారంగా యూరియా వినియోగం గణనీయంగా తగ్గింది వారి ఆదాయం రూ. ఎకరానికి 5000-6000.
18/12/2017

agmarks
జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ -నామ్)
జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ -నామ్) ఏప్రిల్ 14 2016 లో ప్రారంభించబడింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను అనుసందానం చేసి, రైతులకు మెరుగైన ధర వచ్చేందుకు ఈ- నామ్‌ ప్రవేశపెట్టారు.
14/04/2016

agmarks
రైతుల కోసం 'అన్నదాత సుఖీభవ' పథకం
అన్నదాత సుఖీభవ' ఫిబ్రవరి 17, 2019 న ప్రభుత్వం జీవో జారీ చేసింది. తొలి విడతగా రూ.4 వేలు ఇస్తామని సర్కార్ చెప్పింది. అందులో కొంత మొత్తాన్ని మొదటి విడతగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
05/02/2019

agmarks
అన్నదాతలకు సబ్సిడీపై ట్రాక్టర్లు పంపిణీ 'రైతు రథం'.
'రైతు రథం' జూన్ 09, 2017 లో వ్యవసాయాన్ని ఆధునీకరించాలన్నసదాలోచనతో చంద్రబాబు సర్కార్ అన్నదాతలకు సబ్సిడీపై ట్రాక్టర్లు పంపిణీ చేయాలని సంకల్పించింది.
09/06/2017

agmarks
ఆంధ్రప్రదేశ్ రైతులకు 'రుణమాఫీ పథకం'
రుణమాఫీ పథకం ఆంధ్రప్రదేశ్ లో 2014 సంవత్సరంలో ప్రారంభమైంది. రుణమాఫీపై రైతులకు భరోసా కల్పించేందుకు రుణ ఉపశమన పత్రాలను జారీ చేసింది. రుణమాఫీ నిధులు విడుదల చేసినప్పుడు రైతులు ఈ ఉపశమన పత్రాలను సంబంధిత బ్యాంకుల్లో అప్‌లోడ్‌ చేయించుకుని, మాఫీ సొమ్మును ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
11/12/2014

agmarks
ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన
2019 ఫిబ్రవరి 24 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చిన్న మరియు ఉపాంత రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది. ₹6,000 సంవత్సరానికి 3 వాయిదాలలో చెల్లిస్తామని తెలిపారు.
24/02/2019

Chat
Agmarks logo
Our Agent replies you soon. Please Fill your details.